మాస్క్ లేదని ప్రధానికి భారీ జరిమానా

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. కానీ ఆ ఫైన్ వేసింది మన దేశంలో కాదు థాయ్ లాండ్ ప్రధాని మాస్క్ వేసుకోలేదు అన్న కారణంగా ఆయనకు ఆరువేల బాత్ (190 డాలర్లు ) ఫైన్ విధించారు అక్కడి అధికారులు. థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓ చా సోషల్ మీడియాకి సంబదించిన ఒక మీటింగ్ కు హాజరయిన నేపద్యంలో మాస్క్ వేసుకోవడం మరిచి పోయారు.


ఈ క్రమంలో ఆయనకు ఫైన్ విధించారు. ఇక భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో ఉన్న సమయంలో కూడా మాస్క్ ధరించాల్సిందే అని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇవే సూచనలు కొద్ది రోజుల క్రితం తెలంగాణా హెల్త్ డైరెక్టర్ కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే ప్రకటించడం సంచలనం రేపుతోంది.