ఆధార్‌కు పాన్‌ లింక్‌ చేయకపోతే ఏం జరుగుతుంది..? పాన్‌ కార్డు పనిచేయకపోతే ఇంత ప్రమాదమా..!

-

రెండు మూడేళ్ల నుంచి ఆధార్‌కు పాన్ లింక్‌ చేయాలని ఒకటే నస. మొదట లింక్‌ చేయడానికి ఎలాంటి రుసుము తీసుకునే వాళ్లు కాదు.. కానీ అలా ఫ్రీగా చేయించుకోమంటే మనోళ్లు లైట్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా వెయ్యి చేశారు. భవిష్యత్తులో ఆ ధర ఇంకా పెరగవచ్చు. ఐదు నిమిషాల పనికి ఎందుకంత డిమాండ్. చాలా మంది ఈ టాపిక్‌ వచ్చినప్పుడల్లా.. అనుకునేది అసలు ఆధార్‌కు పాన్‌ లింక్‌ చేయకపోతే ఏం అవుతుంది. మన అకౌంట్‌లో గట్టిగా ఐదువేలు కూడా ఉండవులే.. ఇప్పుడు అంత అర్జెంట్‌ ఏం ఉందిలే అనుకుంటారు. ఆధార్‌కు పాన్‌ లింక్‌ చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.!

ఆధార్‌కు పాన్‌ లింక్‌
ఆధార్‌కు పాన్‌ లింక్‌

 

ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది. ఇలాంటి సందర్భాలలో పాన్ కార్డు ఏ పనికి ఉపయోగించడం కుదరదు. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి 15 పనులను చేయడం సాధ్యం కాదు. ఐటీ యాక్ట్-1961 ప్రకారం పాన్ (Pan) కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దానిని ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి.

పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా మారితే కోపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులతో సహా ఏ రకమైన బ్యాంక్‌లోనూ ఖాతాను తెరవలేరు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన డీమ్యాట్ ఖాతాను తెరవలేరు.

పాన్ కార్డ్‌తో లింక్ అయ్యే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను క్రియేట్ చేసుకోవడం కుదరదు.

ఏదైనా చెల్లింపు విషయంలో రూ.50,000 కంటే ఎక్కువ కోసం కస్టమర్లకు యాక్టివ్ పాన్ కార్డు ఉండటం తప్పనిసరి.

మ్యూచువల్ ఫండ్‌లలో రూ.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే.. యాక్టివ్ పాన్ కార్డు తప్పనిసరి.

పాన్ కార్డ్ లేకుండా రూ.50,000 కంటే ఎక్కువ డబ్బులు ఏ సంస్థకు చెల్లించడం సాధ్యం కాదు.

చెల్లని PAN కార్డుతో.. విదేశీ ప్రయాణానికి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చులు చేయలేరు.

యాక్టివ్ PAN కార్డు లేకుండా ఆర్‌బీఐ నుంచి బాండ్ల కోసం రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేయలేరు.

పాన్ లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఏదైనా బ్యాంక్ స్కీమ్‌లో సంవత్సరానికి రూ.5 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి పరిమితి ఉంటుంది.

వస్తువుల కొనుగోలు, అమ్మకం రూ.2 లక్షలకు మించితే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది.

ఇన్‌యాక్టివ్ పాన్‌ని ఉపయోగించి చేసిన చెల్లింపులు పన్ను డిడక్షన్స్‌కి దారితీస్తాయి. ఇది పన్నులపై ప్రభావం చూపవచ్చు.

బ్యాంక్ డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్లు లేదా చెక్‌ల కోసం రూ.50,000 కంటే ఎక్కువ చెల్లించడం కుదరదు.

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 ప్రీమియం కంటే చెల్లించడం సాధ్యం కాదు.

యాక్టివ్ పాన్ కార్డ్ లేకుండా రూ.1 లక్ష కంటే ఎక్కువ షేర్ ట్రాన్సాక్షన్లపై నిషేధం ఉంటుంది.

వాహనం (మోటారు వాహనాలు లేదా ద్విచక్ర వాహనాలు మినహా) అమ్మకం లేదా కొనుగోలు చేయలేరు.

Read more RELATED
Recommended to you

Latest news