వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌..!

-

వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది. ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త ఫీచర్ ని తీసుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ని తీసుకు రావడం జరిగింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఒకే నంబర్‌ తో ఒకే సారి రెండు స్మార్ట్‌ ఫోన్లతో పాటు మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి వాట్సాప్ పర్మిషన్ ని ఇచ్చింది.

కంపానియన్ మోడ్ ని తీసుకు వచ్చింది వాట్సాప్. కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది ఈ మోడ్ ని. బీటా టెస్టర్ల కోసం ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. మొబైల్, డెస్క్‌టాప్‌లో ఏకకాలంలో వాట్సాప్‌ను వాడచ్చు అని వాట్సాప్ అంది. ‘లింక్ డివైస్’ ఆప్షన్ ద్వారా రెండో స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇంకో స్మార్ట్ ఫోన్ తో లింక్ చేసాక చాట్ హిస్టరీ చూడటం, మెసేజేస్‌ ని చూడడం అన్ని చేయచ్చు.

నాలుగు పరికరాలను రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్ , ఒక డెస్క్‌టాప్‌కి లింక్‌ చేసుకోవచ్చు. అలానే ఈ మధ్య గ్రూప్‌లో పాల్గొనే వారి సంఖ్యను 1024కి పెంచారు. అంతే కాక ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిటీస్‌ ఫీచర్‌ను కూడా అందుబాటు లోకి తెచ్చింది. ఒక గ్రూపు గరిష్టంగా 12 గ్రూపులను క్రియేట్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news