పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ పై విత్డ్రా లిమిట్ పెంపు…!

-

పోస్టాఫీస్ ( Post Office ) ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ తో చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. అయితే పోస్టాఫీస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇండియా పోస్ట్ ఇప్పుడు సేవింగ్ స్కీమ్స్ పై విత్డ్రా లిమిట్ ని పెంచింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

పోస్టాఫీస్ | Post Office

ఇక కొత్త రూల్స్ ని చూసేస్తే.. ఇండియా పోస్ట్ ఖాతాదారుల విత్డ్రా లిమిట్ ని పెంచింది. దీనితో గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ ఖాతాదారులు రోజుకి ఇరవై వేల వరకు డ్రా చెయ్యచ్చు. గతంలో అయితే ఇది ఐదు వేలు ఉండేది. అలానే యాభై వేలు వరకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ క్యాష్ డిపాజిట్ చెయ్యడానికి ఒప్పుకుంటారు. కానీ యాభై వేలు దాటి చెల్లించడానికి అవ్వదు.

PPF, KVP, NSC కొత్త రూల్స్:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), కిసాన్ వికాస్ పత్ర (KVP), జాతీయ పొదుపు సర్టిఫికెట్ (NSC) పథకాలు వున్నవారు డిపాజిట్ లేదా విత్డ్రా  చెక్ ద్వారా అవుతుంది.

పోస్ట్ ఆఫిస్ సేవింగ్ స్కీమ్: మినిమమ్ బ్యాలెన్స్

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్‌పై 4% వడ్డీ వస్తుంది. అలానే తప్పని సరిగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ ఖాతాలో రూ .500 కనీస బ్యాలెన్స్ ఉంచాలి. ఒకవేళ రూ.500 కన్నా తక్కువ ఉంటే, రూ.100 అకౌంట్ మెయింటెనెన్స్ ఫైన్‌గా తీసివేయబడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version