ప్రధాని మోదీ దేశంలోని పేదలందరూ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో జన్‌ధన్ పథకం కింద బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే ఆ అకౌంట్ ఉన్నవారికి పలు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జన్‌ధన్ అకౌంట్లు ఉన్నవారు తమ అకౌంట్‌లో డబ్బులు లేకున్నా రూ.5వేలు తీసుకోవచ్చు. అందుకు గాను ఆయా అకౌంట్లకు ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) సదుపాయం కల్పిస్తున్నారు. అయితే దీన్ని పొందాలంటే ఖాతాదారు గత 6 నెలల నుంచి తమ ఖాతాను నిర్వహిస్తూ, అందులో బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. అలాగే ఆ అకౌంట్‌కు ఇచ్చే రుపే డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉండాలి. దీంతోపాటు ఆ అకౌంట్లను ఆధార్ నంబర్లకు లింక్ చేసి ఉండాలి. ఈ మూడు నిబంధనలను పాటించిన జన్‌ధన్ ఖాతాదారులకే పైన తెలిపిన విధంగా రూ.5వేల ఓడీ సదుపాయం పొందేందుకు వీలుంటుంది. ఇక ఆ మొత్తాన్ని వాడుకుంటే స్వల్పంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
జన్‌ధన్ ఖాతాలతో ఇచ్చే రుపే డెబిట్ కార్డులకు గాను రూ.1 లక్ష యాక్సిడెంటల్, రూ.30వేలు యాక్సిడెంటల్ డెత్, మొత్తం కలిపి రూ.1.30 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ ఆ ఖాతాదారులు చనిపోతే వారి నామినీలు రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
అయితే జన్‌ధన్ ఖాతాదారులు తమ అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడంతోపాటు అకౌంట్‌ను, డెబిట్ కార్డును విరివిగా వాడుతుంటేనే.. పైన తెలిపిన ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే ఆ ప్రయోజనాలను పొందలేరు.