మీ ఇంటి నంబర్‌తో మీ జీవితానికి లింకుంది!

అవును! నంబర్లకు మన జీవితానికీ సంబంధం ఉంది అంటున్నారు న్యూమరాలజిస్టులు. దీన్ని నమ్మేవారు నమ్ముతారు. ఎవరి వైఖరి వారిది. నంబర్లు ఇళ్లకు ఎనర్జీ ఇస్తాయని న్యూమరాలజిస్టులు కొందరు చెబుతున్నారు. ఇంట్లోవారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే.. ఇంటి నంబర్‌ సరైనది ఉండాలంటున్నారు. మరి ఏ నంబర్‌ ఎలాంటిదో తెలుసుకుందాం.


ముందుగా నంబర్‌ను గుర్తించే విధానం

ఒకవేళ మీ ఇంటి నంబర్‌ 183 అయితే… ఆ ఇంటి సంఖ్య 1+8+3=12 అదే నంబర్‌ 68 అయితే… ఆ ఇంటి సంఖ్య 6+8=14.. అప్పుడు 1+4=5 అవుతుంది. అలా డబుల్‌ సంఖ్యలను కలిపేస్తూ… చివరకు సింగిల్‌ నంబర్‌ రావాలి. అది ఆ ఇంటి నంబర్‌ అంటున్నారు.

ఇంటి నంబర్‌..1

సాధారణంగానే ఈ ఇంట్లో నివసించేవారు రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడరు. ఎందులోనైనా ముందడుగు వేస్తారు. ప్రతి పరిస్థితినీ మీకు ముఖ్యమైనదిగానే భావిస్తారు. ఈ ఇంట్లో ఉండేవారికి తరచూ ప్రపంచమంతా తిరగాలని అనిపిస్తూ ఉంటుంది.

ఇంటి నంబర్‌..2

ఈ నంబర్‌ ఉన్న ఇంట్లో ఉండే వారు కుటుంబంతో గడపాలి అనుకునేవారికి 2 ఉంటే మంచిది. మనస్శాంతిని కోరుకుంటారు. గొడవల జోలికే వెళ్లరు. వీళ్లకు ఇంట్లో ఉండటమే ఎక్కువగా ఇష్టం.

ఇంటి నంబర్‌..3

ఈ ఇంట్లో వారికి భయం ఉండదు. వీరి దైవ కార్యాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని ఫిలాసపీ కోణంలో చూస్తూ… ఏదీ శాశ్వతం కాదు అని నమ్ముతుంటారు.

ఇంటి నంబర్‌..4

ఈ ఇంట్లో వారు భద్రతకు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. వీరు చెడు సావాసాలకు చాలా దూరంగా ఉంటారు. వీలైనంతవరకూ ఎవరితోనూ కలవరు. అందువల్ల సమాజానికి దూరంగా ఉంటున్నారు అనే అభిప్రాయం ఇతరులకు కలుగుతుంది.

ఇంటి నంబర్‌..5

వీళ్లు ఎవరిని కలిసినా… అందరి చూపూ వీళ్లపైనే ఉంటుంది. అంత చలాకీగా ఉంటారు. అధిక ఉత్సాహం వల్ల అలసిపోతుంటారు. వీరి చేతికి డబ్బు బాగానే వస్తుంటుంది. కానీ త్వరగా ఖర్చైపోతుంది. ఎప్పటికప్పుడు ఆనందంగా గడిపేస్తారు.

ఇంటి నంబర్‌..6

చాలా సైలెంట్‌. అస్సలు గొడవ పడరు. వీళ్లు తమను తాము జాగ్రత్తగా చూసుకుంటూ… తమ చుట్టూ ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండేలా చేసుకుంటారు. ఈ ఇంట్లో ఉండేవారు… వీలైనంతవరకూ ఇతర ఇళ్లు మారేందుకు ఇష్టపడరు. శాశ్వతంగా అక్కడే ఉండేందుకే సిద్ధపడతారు.

ఇంటి నంబర్‌ 7

ఎల్లప్పుడూ తమ జీవితానికి అర్థం ఏంటి అని వెతుకుతూ ఉంటారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వీళ్లు పెద్దగా పట్టించుకోరు. అదే సమయంలో వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ… జీవిత సారాన్ని తెలుసుకునే పనిలో బిజీగా ఉంటారు. ఇల్లు మారితే… జీవితంలో మార్పు వస్తుందనుకుంటే, వీళ్లు ఇల్లు మారతారు.

ఇంటి నంబర్‌ 8

తమ కెరీర్‌ పట్ల ఎంతో ఆసక్తి చూపించేవారికి ఈ ఇల్లు బాగా సెట్‌ అవుతుంది.బాధ్యతల విషయంలో వీరు చాలా నిబద్ధతతో ఉంటారు. ఈ ఇంట్లోని వారు సహజంగానే నాయకత్వ లక్షణాలతో ఉంటారు.

ఇంటి నంబర్ ‌9

చురుకుదనం కాస్త తక్కువ.. ఇతరులు ఏదైనా సూచన చెబితే… వీరు అస్సలు పాటించరు. తాము చేసే పని వల్ల తమకే నష్టం కలుగుతుంది అని తెలిసి కూడా అదే పని చేస్తారు.

ఇంటి నంబర్ ‌10

ఈ ఇంట్లోవారు ప్రయాణాలు ఎక్కువ చేస్తాను. అందుకే ఇంటి నంబర్‌ 10 ఉంటే ఆ ఇంట్లో ఎవరూ ఎక్కువ కాలం ఉండరు. ఈ ఇంట్లో ఉండేవారు విడాకులు తీసుకునేందుకు రెండోసారి ఆలోచించరు.