మెగాస్టార్ నివాసంలో సమావేశం ..పాల్గొన్న సినీ ప్రముఖులేవరంటే ..?

-

కరోనా మహమ్మారి విస్తరించి అల్ల కల్లోలం సృష్ఠించిన కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు గత కొన్ని రోజులుగా ఎక్కడికక్కడే స్థంబించిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ పూర్తిగా మూతపడింది. థియోటర్స్ మూత పడటం రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోవడతో పెద్ద దెబ్బే పడింది.

 

అయితే కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కార్యకలాపాలపై నేడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో చర్చ జరిగింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్ మోహన్ రావు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఇక సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం, థియేటర్స్, సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలపై కీలక చర్చ జరిగిన్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ తరువాత టాలీవుడ్ భవిష్యత్ కార్యాచరణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోగా, పూర్తి అయిన సినిమాల విడుదల ఆగిపోయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివలన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. వీటన్నిటిని తిరిగి ప్రారంబించేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రానున్నారు.

ఇక ఈ సమావేశంలో నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, త్రివిక్రం, అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డి, వి వి వినాయక్, ఎన్.శంకర్, కొరటాల శివ, జెమిని కిరణ్, సి.కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశం అయ్యాక వీరందరు కలిసి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news