విశాఖలో గ్యాస్ లీక్ జరిగిన వెంటనే హుటాహుటున జిల్లాలు దాటుకుంటూ రోడ్డూ మార్గంలో ఏపీ సీఎం, మంత్రులూ ప్రమాధ స్థాలనికి చేరుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన జగన్… ఉన్నపలంగా మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం మూడు రోజుల్లో చెక్కులు అందజేశారు! “ఈ సహాయం ఒక చరిత్ర.. ఎవ్వరూ ఊహించని సాయం ఇది” అని బీజేపీ – కమ్యునిస్టు నేతలు సైతం జగన్ కు అభినందనలు తెలిపారు! ఈ క్రమంలో చంద్రబాబు విశాఖకు వెళ్లడానికి ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి అడగకుండా.. జాతీయస్థాయిలో అనుమతి అడిగి అబాసుపాలయిన సంగతి తెలిసిందే. ఈ సంగతులపై తాజాగా మహానాడు వేదికగా చంద్రబాబు స్పందించారు! అంతేనా… మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు!
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారంలో మృతుల కుటుంబాలకు ఎవ్వరూ ఊహించని రీతిలో, విపక్షాలు సైతం ఔరా అనే స్థాయిలో జగన్ ప్రభుత్వం తరుపున పరిహారం ప్రకటించారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేను కానీ… ఆ మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాను అంటూ ఈ ప్రకటన చేశారు. ఆ సమయంలో తన పరిపాలనలో జరిగిన ప్రమాధాలు, ఆ ప్రమాధాలపై తన స్పందనను మరిచినబాబు… ఆన్ లైన్ లోకి వచ్చారు! ఎవరు జగన్ ని కోటి రూపాయలు అడిగారు, కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా.. అని ప్రశ్నించారు!
కోటి రూపాయలు ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించిన ఆ చంద్రబాబే… మహానాడు వేదికపై విశాఖ ఎల్జీపాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. వారి కుటుంబాలకు రూ.50వేల సాయాన్ని ప్రకటించారు. సరిగ్గా ఇక్కడే వైకాపా నాయకులకు బాబు దొరికిపోయారు! కోటి సాయం ఇస్తే తిరిగిరాని ప్రాణాలు రూ. 50వేలు ఇస్తే వస్తాయా… మహానాడులో మౌనం పాటించినంతమాత్రాన్న మరణించినవారు తిరిగి లేస్తారా… అసలు నిన్ను రూ. 50వేల సాయం ఎవరు అడిగారు బాబు.. అని ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు! ఈ రూ. 50వేల సాయంపై బాబు ఎలా స్పందిస్తారో.. ఇంకెలా సమర్ధించుకుంటారో వేచి చూడాలి!