లాక్‌డౌన్ త‌రువాత మొద‌టి ప్ర‌త్యేక‌ సేల్‌.. వివో ఫోన్ల‌పై భారీ ఆఫ‌ర్లు..

-

మొబైల్స్ త‌యారీదారు వివో ఫ్లిప్‌కార్ట్‌లో వివో డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక‌మైన సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో వివో ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ప‌లు ఫోన్ల కొనుగోలుపై వినియోగ‌దారులు క్యాష్‌బ్యాక్ కూడా పొంద‌వ‌చ్చు. అనేక ఫోన్ల‌పై సుదీర్ఘ‌కాలం పాటు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కార్డుల‌తో వివో ఫోన్ల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. ఇక ఈ సేల్ బుధ‌వారం ప్రారంభం కాగా.. మే 29వ తేదీన ముగియ‌నుంది. లాక్‌డౌన్ అనంత‌రం నిర్వ‌హిస్తున్న మొద‌టి ప్ర‌త్యేక‌ సేల్ ఇదే కావ‌డం విశేషం.

vivo days sale in flipkart wonderful offers

సేల్‌లో ఉన్న ఆఫ‌ర్లు ఇవే…

* వివో డేస్ సేల్‌లో.. వివో జ‌డ్‌1ఎక్స్ ఫోన్‌పై 12 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియెంట్ ధ‌ర రూ.15,990 ఉండ‌గా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.16,990, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.17,990గా ఉంది.

* ఇటీవ‌లే కొత్త‌గా లాంచ్ చేసిన వివో వి19 ఫోన్‌పై ఈ సేల్‌లో రూ.13,250 వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. దీనిపై 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ఱ రూ.27,990 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.31,990గా ఉంది.

* సేల్‌లో వివో ఎస్‌1 ప్రొ ఫోన్‌పై ప‌లు బ్యాంకులు ఏకంగా 18 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.20,990గా ఉంది. ఈ ఫోన్‌పై కూడా రూ.13,250 వ‌ర‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

* వివో ఎస్‌1పై 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర‌ రూ.16,990 ఉంగా, 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.19,990గా ఉంది.

* సేల్‌లో వివో వి17 ఫోన్‌పై 18 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందిస్తున్నారు. వివో వై19పై 9 నెల‌లు, వై12, వై11, వై15 ఫోన్ల‌పై 6 నెల‌ల వ‌రకు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news