లోకేష్ “ఇలాగే” ఉండాలని కోరుకుంటున్నారు!

-

అధికబరువును అంతా బాధ్యతగా ఫీలవుతున్న రోజులివి! మిగిలిన బాధ్యతలు అంతా ఎంత ముఖ్యమో ఈ అధిక బరువు బాధ్యతను తగ్గించుకోవడం అంతకంటే ముఖ్యమైపోయిన రోజులివి! కూర్చుని చేసే పనులు ఎక్కువైపోవడంతో ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా అనే పరిస్థితులు వచ్చేశాయి! దానికి తోడు మారుతున్న ఆహారపు అలవాట్లు మనిషి ఆయుశ్ ను తగ్గించేస్తున్నాయనేది అంతా చెబుతున్నమాటే! ఈ క్రమంలో లాక్ డౌన్ సమయంలో సినిమా హీరోలు హీరోయిన్లు వంటివారు తమ అందం, ఫిట్ నెస్ లపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో అంతా చూస్తూనే ఉన్నారు! వాళ్లే ఆదర్శమో లేక ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధో తెలియదు కానీ… చినబాబు లోకేష్ కూడా బరువు తగ్గారు!

టీడీపీ భవిష్యత్ ఆశాజ్యోతి, బాబు రాజకీయ వారసుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయిన లోకేష్… కరోనా సమయంలో పూర్తిగా ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టారంట! మహానాడు సందర్భంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు వచ్చిన లోకేష్ కాస్త స్లిం గా కనిపించే సరికి చుట్టూ ఉన్న నాయకులు ఇదే ప్రశ్న అడిగారు! దీనికి కాస్త సిగ్గు పడుతూ, మరికాస్త గర్వ పడుతూ స్పందించిన లోకేష్… లాక్ డౌన్ సందర్భంగా హైదరాబాద్ లో వ్యాయామాలపై దృష్టి పెట్టానని, డైటింగ్ కూడా చేశానని తెలిపారు!

పోనీలే… కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలు, వారి కష్టాలు.. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ లో బాధితుల కనీళ్లు.. వలస కార్మికుల వేదనలు.. కరోనా సృష్టించిన కష్టాలు.. ఇవన్నింటిపై శ్రద్ధ పెట్టలేకపోయినా.. కరోనా సమయంలో కనీసం కార్యకర్తలు ఎలా ఉన్నారు అనే విషయాలపై దృష్టి పెట్టకపోయినా.. దీనావస్థలో ఉన్న పార్టీ తరుపున కరోనా సమయంలో సాయం పేరుచెప్పి అయినా కాస్త జనాల్లోకి వెళ్లలేకపోయినా… వ్యక్తిగత ఆరోగ్యంపై అయినా లోకేష్ బాబు శ్రద్ధ పెట్టారని, ఆయన నిండు నీరూళ్లు “ఇలాగే” ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news