భారతదేశ జెండా కింద ఆ చిన్నారిని ఉంచండి… దేశం కన్నీరు పెట్టే వీడియో…!

-

దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలు, కూలి నాలీ, బిచ్చం ఎత్తుకుని బ్రతికే ప్రజలు పడే కష్టాలు, ఏ ఆసరా లేని వారు పడే కష్టాలు… ఎంత చెప్పినా తక్కువే. వ్యాపారాలకు రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు ఏ గుర్తింపు లేని భారతీయులను మాత్రం అనాధలుగా వదిలేస్తూ కనీసం కనికరం లేకుండా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి.

ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. రోజు రోజుకి దారుణంగా అమారుతున్నాయి అక్కడి పరిస్థితులు. తాజాగా బయటకు వచ్చిన ఒక వీడియో చూసి దేశం కన్నీరు పెడుతుంది. బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఒక చిన్నారి తన తల్లి మరణించింది అనే విషయం తెలియక అతను ఆమెను లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ వీడియో ని అక్కడ ఉన్న వ్యక్తి షూట్ చేసాడు.

ఆమెను తన చేతిలో ఉన్న దుప్పటితో లేపే ప్రయత్నం చేసాడు. అయినా సరే ఆమె లేవడం లేదు. ఆ చిన్నారికి కోపం కూడా వస్తుంది. తన తల్లి ఎందుకు లేవడం లేదో ఆ చిన్నారికి అర్ధం కాలేదు. భారత్ అభివృద్ధి చెందుతుంది అనే ముందు ఈ వీడియో ని చూపించండి, రెపరెపలాడే భారత జెండా కింద ఆమెను ఉంచండి, ఆ చిన్నారి ఫోటోని కూడా జోడించండి అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news