సినిమా తీయడం ఒక ఎత్తైతే తీసే సినిమాకు పబ్లిసిటీ చేసుకోవడం మరో ఎత్తు. స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదు. మీడియా వాళ్లే కావాలని అవి కవర్ చేస్తారు. కాని ఓ చిన్న సినిమాను మాత్రం ఏదైనా స్పెషల్ అనిపిస్తేనే అది ప్రమోట్ చేస్తారు. ఇంతకీ ఎందుకు ఇదంతా అనుకోవచ్చు. చిన్న సినిమాల్లో కంటెంట్ బేస్డ్ తో వచ్చే సినిమాల లెక్క ఒకలా ఉంటే.. బూతు కంటెంట్ తో వచ్చే సినిమాల లెక్క మరోలా ఉంటుంది.
అలా వచ్చే సినిమాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందనుకోండి. లేటెస్ట్ గా అలాంటి ఘాటైన సినిమానే ఒకటి వస్తుంది. సినిమా టైటిల్ ఏడు చేపల కథ. టైటిల్ చూసి ఇది రాజు గారి ఏడు చేపల కథ అనుకుంటే పొరబడినట్టే. ఇది టెంప్ట్ రవి చెప్పే ఏడు చేపల కథ. అమ్మాయి కనిపిస్తే టెంప్ట్ అయ్యే రవి తన టెంప్టింగ్ పర్సనాలిటీతో ఎన్ని వేశాలేశాడో చెప్పే సినిమానే ఏడు చేపల కథ.
ఈ సినిమా టీజర్ చూడాలంటే 18 ప్లస్ అయ్యుండాలని ముందు ఓ హెచ్చరిక కూడా వేశారు. సినిమాలో కంటెంట్ కన్నా బూతు పురాణమే ఎక్కువ కనిపిస్తుంది. మరి అసలు ఈ ఏడు చేపల కథ ఏంటో.. ఈ టెంప్ట్ రవి కవ్వింతలు ఏంటో సినిమాలో చూడాల్సిందే. టీజర్ చూస్తే ఇదేదో బి గ్రేడ్ సినిమా కాదు కాదు అంతకుమించిన సినిమాగా అనిపిస్తుంది.