తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఎందరో ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ…హ్యాపీ బర్త్‌డే బావా అని పేర్కొన్నారు. సంతోష్‌కుమార్ తన ట్వీట్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలు నాటాల్సిందిగా హరీశ్‌ను కోరారు. పుట్టినరోజును పురస్కరించుకుని మరో మూడు మొక్కలకు జీవితాన్నిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు పెద్దఎత్తున మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్‌రావు పూర్తి ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
హ్యాపీ బర్త్‌డే బావా…!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Rohit Sharma: MIకి లాస్ట్ మ్యాచ్: రోహిత్‌కు స్టాండింగ్ ఒవేషన్
నిన్న లక్నోపై ఓడిపోయి పాయింట్లు పట్టికలో అట్టడుగునా నిలిచి ముంబై ఇండియన్స్...
దీపిక పదుకోణ్ కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటిగా రికార్డ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్...
కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు.. కేంద్రం అలర్ట్
కిర్గిస్థాన్ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం...