డొనాల్డ్ ట్రంప్‌కు భ‌య‌ప‌డుతున్న ఫేస్‌బుక్ సీఈవో..?

-

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న పోస్టులు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ పోస్టులను తొల‌గించ‌కుండా అలాగే ఉంచ‌డం వ‌ల్ల జుక‌ర్ బ‌ర్గ్ ఉద్యోగులు క‌న్నెర్ర చేస్తున్నారు. విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే పోస్టుల‌ను ఫేస్‌బుక్‌లో పెట్ట‌రాదు. ఆ ప‌నిచేస్తే ఫేస్‌బుక్ వాటిని తొల‌గిస్తుంది. అలాంటి యూజ‌ర్లను బ్లాక్ కూడా చేస్తారు. కానీ ప్ర‌స్తుతం డొనాల్డ్ ట్రంప్ స‌రిగ్గా అలాంటి పోస్టులే పెడుతున్న‌ప్ప‌టికీ.. ఆ పోస్టుల‌ను తొల‌గించ‌డం లేదు స‌రిక‌దా.. వాటిని జుక‌ర్‌బ‌ర్గ్ స‌మ‌ర్థిస్తుండ‌డం ఆ సంస్థ ఉద్యోగుల‌కే న‌చ్చ‌డం లేదు. దీంతో జుక‌ర్‌బ‌ర్గ్ ప్ర‌స్తుతం డొనాల్డ్ ట్రంప్‌కు భ‌య‌ప‌డుతున్నారంటూ.. ప‌లువురు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

facebook ceo zuckerberg might be in fear of donald trump

అమెరికాలో మే 25వ తేదీన జార్జి ఫ్లాయిడ్ అనే న‌ల్ల జాతీయుడిపై ఓ తెల్ల‌జాతి పోలీసు అధికారి దాడి చేసి అత‌ని చావుకు కార‌ణ‌మ‌య్యాడు. దీంతో అప్ప‌టి నుంచి అమెరికా వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు చెల‌రేగుతున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఆ నిర‌స‌న‌ల సెగ‌కు బంక‌ర్‌లో త‌ల‌దాచుకున్నారు. అయితే.. ఫేస్‌బుక్‌లో మాత్రం ఆందోళ‌న‌కారుల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ట్రంప్ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ పోస్టుల‌పై స్పందించాల‌ని జుక‌ర్‌బ‌ర్గ్‌ను ఫేస్‌బుక్ ఉద్యోగులు అడగ్గా.. అవి త‌మ సంస్థ పాల‌సీల‌కు విరుద్ధంగా ఏమీ లేవ‌ని వారితో చెప్పాడు. ఆ పోస్టుల‌ను జుక‌ర్‌బ‌ర్గ్ స‌మ‌ర్థించాడు. దీంతో ఫేస్‌బుక్ ఉద్యోగులు జుక‌ర్‌బ‌ర్గ్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. జుక‌ర్‌బ‌ర్గ్ సంస్థ పాల‌సీల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన తిమోతీ అవెని అనే ఓ ఇంజినీర్ ఈ వ్య‌వ‌హారం న‌చ్చ‌క త‌న జాబ్‌కు రిజైన్ చేశారు. మ‌రొక కీల‌క ఉద్యోగి కూడా ఫేస్‌బుక్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలిసింది.

అయితే జుక‌ర్‌బ‌ర్గ్ ఇలా ట్రంప్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఫేస్‌బుక్ పాల‌సీల‌కు వ్య‌తిరేకంగా వెళ్తుండ‌డాన్ని ఆ సంస్థ‌కు చెందిన ఉద్యోగులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే పోస్టుల‌ను పెట్టేవారు ఎవ‌రైనా స‌రే.. ఆ పోస్టుల‌ను తొల‌గించాల్సిందేన‌ని.. అలాంటి యూజ‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సింది పోయి.. జుక‌ర్‌బ‌ర్గ్ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని వారు అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్‌కు జుక‌ర్ బ‌ర్గ్ భ‌య‌ప‌డుతున్నారేమోన‌ని.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి జుక‌ర్‌బ‌ర్గ్ ముందు ముందు ఈ విష‌యంలో ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కొంటాడో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news