మెగా ‘హలోవీన్’.. సందడే సందడి..!

-

ఈ నెల 31న ముగుస్తున్న హలోవీన్ వేడుకలను గుర్తుచేస్తూ మెగా ఫ్యామిలీ హలోవీన్ పార్టీ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి కళ్యాణ్ దేవ్ వరకు అందరు ఈ వేడుకలో పాల్గొన్నారు. హలోవీన్ సెలబ్రేషన్స్ లో భాగంగా రకరకాల భయంకరమైన రూపాల్లో కనిపించారు. ఉపాసన తన అత్తని భయపెడుతూ కనిపించింది. సాయి ధరం తేజ్, శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి, ఉపాసన ఇలా మెగా, అల్లు కుటుంబాలు పిల్లలు, పెద్దలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రస్తుతం అయ్యప్ప మాల ధరించి ఉండటం వల్ల రాం చరణ్ ఈ వేడుకల్లో పాల్గొనలేదు. పిల్లలతో సరదాగా సాగిన ఈ హలోవీన్ ఫెస్టివల్ లో మెగా ఫ్యామిలీ సందడి అభిమానులను సంతోషపరచింది. ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించేలా హీరోలు చేస్తున్న ఈ ప్రయత్నాలు తమ అభిమానులకు మెసేజ్ ఇచ్చేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news