అతన్ని నమ్మి మోసపోయిన మహేష్

-

తెలుగులో ఫ్లాప్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న మెహెర్ రమేష్ కంత్రి, బిల్లా అనే రెండు సినిమాలు పర్వాలేదు అనిపించాయి. అయితే మనోడితో సినిమా చేసే ధైర్యం లేక నిర్మాతలు అతన్ని దూరం పెట్టారు. మెహెర్ రమేష్ సినిమాలు చేయకున్నా సరే సూపర్ స్టార్ మహేష్ కు చాలా క్లోజ్. మహేష్ నటించిన బాబి సినిమాలో కూడా నటించాడు అతను. అప్పటి నుండి మెహెర్ రమేష్ మహేష్ మధ్య మంచి రిలేషన్ ఉంది.

మెహెర్ రమేష్ డైరక్షన్ లో రెండు మూడు యాడ్స్ కూడా చేశాడు మహేష్. అతన్ని నమ్మి యూఎస్ లో ఓ ఈవెంట్ ప్లాన్ చేయగా అది కాస్త తుస్సు మన్నది. మూవీ ఆర్టిస్ట్ అసోశియేషన్ వారు మహేష్ తో కలిసి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. డిన్నర్ విత్ మహేష్ ప్రొగ్రాం ప్లాన్ చేయగా ఆ కార్యక్రమం అంతా మెహెర్ రమేష్ కు అప్పచెపారు. అయితే అతని అశ్రద్ధ వల్ల కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడవడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది.

నిర్వాహకులు కూడా చేతులెత్తేయడంతో దీనికి మొత్తం కారణం మెహెర్ రమేష్ అని తేలింది. యూఎస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మహేష్ కు ఇలా జరగడం ఆశ్చర్యపరచింది. మహేష్ ప్రస్తుతం అమెరికాలోనే మహర్షి షూటింగ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news