భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ఆలోచన మానుకోవాలి ..మెగాస్టార్ చిరంజీవి

-

కరోనా కొట్టిన దెబ్బతో ప్రతీ ఇండస్ట్రీలో దాదాపు రెండు మూడు సంవత్సరాలు కోలుకోలేకుండా అయిపోయింది. ఇక చిత్ర పరిశ్రలు అయితే ఊహించడానికి కూడా చాలా కష్టంగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ గతం లాగా సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. దాంతో మెగాస్టార్ చిరంజీవి అన్ని రకాలుగా ఆలోచించి అన్ని పరిస్థితులను బేరీజు వేసి ఇండస్ట్రీ పెద్దగా నిర్మాతలకి దర్శకులకి తన అభిప్రాయాలను సలహాలను ఇస్తున్నారట.

 

ముఖ్యంగా భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించే ఆలోచనలు ఇప్పట్లో చేయకపోవడం చాలా ఉత్తమమని చెబుతున్నారట. ఈ విషయంలో ముందుగా మెగా కంపౌండ్ లో ఉన్న అల్లు అరవింద్, రామ్ చరణ్ లకు ఈ సలహా ఇచ్చారట. చరణ్ కి ఇప్పటి నుంచి తన బ్యానర్ లో ప్లాన్ చేసే సినిమాలని తక్కువ బడ్జెట్ తో ప్లాన్ చేయమని చెప్పారట.

ఇక ఆల్రెడీ భారీ బడ్జెట్ సినిమాలకు అడ్వాన్స్ లు గనక ఇస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ అడ్వాన్సులు వెనక్కి తీసుకోవడం మంచిదని కూడా చిరు చెప్పారట. ఇక రామ్ చరణ్ నిర్మాతగా ఆయన నటిస్తున్న ఆచార్య మూవీ బడ్జెట్ కూడా తగ్గించే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పట్లో థియోటర్స్ కూడా ఓపెన్ అయ్యో అవకాశాలు లేవని ఓవేళ ఓపెన్ అయినా కూడా జనాలు ఇంతక ముందు మాదిరిగా థియోటర్స్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అందువల్ల వ్యాపార పరంగా భారీగా నష్టాలు వాటిల్లే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారట. దాంతో ఎంత పరిమిత బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తే అంత మంచిదని మెగాస్టార్ సూచించారట.

Read more RELATED
Recommended to you

Latest news