చ‌వ‌క ధ‌ర‌ల‌కే Vu కొత్త 4కె ఆండ్రాయిడ్ టీవీలు..!

-

వు (Vu) టెలివిజ‌న్స్ కంపెనీ భార‌త్‌లో చ‌వ‌క ధ‌ర‌ల‌కే ప‌లు నూత‌న ఆండ్రాయిడ్ 4కె టీవీల‌ను విడుద‌ల చేసింది. 43, 50, 55, 65 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ నూత‌న టీవీలు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి. ఇవి 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను క‌లిగి ఉన్నాయి. వీటిలో అందిస్తున్న ప్రొ పిక్చ‌ర్ కాలిబ్రేష‌న్ ఫీచ‌ర్ స‌హాయంతో పిక్చ‌ర్ క్వాలిటీని మ‌రింత ఎక్కువ‌గా పొంద‌వ‌చ్చు. అలాగే నాయిస్ రిడ‌క్ష‌న్‌, క‌ల‌ర్ టెంప‌రేచ‌ర్ త‌దిత‌ర ఇత‌ర పిక్చ‌ర్ రిలేటెడ్ ఫీచ‌ర్ల‌ను కూడా ఈ టీవీల‌లో అందిస్తున్నారు.

Vu Launched New 4K Android TVs in India

వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్, గూగుల్ ప్లే త‌దిత‌ర యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. గూగుల్ ప్లే ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర స్ట్రీమింగ్ యాప్స్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకుని ఈ టీవీల‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వాటిలోని వీడియోలు, మూవీలు, సిరీస్‌ల‌ను వీక్షించ‌వ‌చ్చు.

ఈ టీవీల‌లో డాల్బీ విజ‌న్‌, హెచ్‌డీఆర్ 10, డాల్బీ డిజిట‌ల్ ప్ల‌స్‌, డీటీఎస్ వ‌ర్చువ‌ల్ ఎక్స్ స‌రౌండ్ సౌండ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, గూగుల్ అసిస్టెంట్‌కు స‌పోర్ట్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు, ఇయ‌ర్‌ఫోన్ జాక్‌, ఆప్టిక‌ల్ రేడియో, ఆర్ఎఫ్ అన‌లాగ్ పోర్ట్‌, ఏవీ ఇన్‌పుట్‌, ఈథ‌ర్‌నెట్ పోర్టు, క్రోమ్‌క్యాస్ట్ స‌పోర్ట్‌.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఇక వు కంపెనీ కొత్త టీవీల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…
* 43 ఇంచుల వు అల్ట్రా 4కె టీవీ (43 యూటీ) ధ‌ర రూ.25,999.
* 50 ఇంచుల వు అల్ట్రా 4కె టీవీ (50 యూటీ) ధ‌ర రూ.28,999.
* 55 ఇంచుల వు అల్ట్రా 4కె టీవీ (55 యూటీ) ధ‌ర రూ.32,999.
* 65 ఇంచుల వు అల్ట్రా 4కె టీవీ (65 యూటీ) ధ‌ర రూ.48,999.

ఈ అన్ని టీవీ మోడల్స్‌ను అమెజాన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ విక్ర‌యిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news