తండ్రికి తగ్గ తనయుడిగా అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో రానిస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నారు నందమూరి నట సింహం బాలకృష్ణ. సామాజిక సేవలో సైతం ఆయన ముందుంటారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే మనస్తత్వం బాలయ్యది. జీవితంలో కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు అని అనుకుంటాను.. పొరపాటున అవి నా కంటికి కనిపించినా, చెవులకు వినిపించినా టెంపర్ లేచుద్ది అనే బాలయ్య సినిమాలోని డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి ఇది సినిమా డైలాగ్ మాత్రమే కాదు, ఆయన నిజ జీవితంలో కూడా అంతే. అందుకే బాలయ్య అంటే చాలా మందికి భయం. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు.
కానీ, అలాంటి బాలయ్యని బయపెట్టే వ్యక్తి ఒకరున్నారట. ఈ విషయాన్ని స్వయాన బాలకృష్ణ నే చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బాలకృష్ణ మీడియాతో పంచుకున్నారు. నాన్నగారి తర్వాత తాను భయపడేది కేవలం బ్రహ్మణికి మాత్రమేనని ఆయన అన్నారు. బ్రహ్మణి చాలా బ్యాలెన్స్‌డ్ అని చెప్పిన బాలకృష్ణ.. ఆమె ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా చెబుతుందన్నారు. ఆమె వల్లే తనకు సహనం అలవరిందని.. తను ఏం చెప్పినా వింటానని చెప్పుకొచ్చారు.