అన్నమో రామ చంద్రా అంటున్న ప్రపంచం

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మిగిల్చిన విషాదం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. కరోనా దెబ్బకు కోట్ల మంది ప్రజలు ఆకలితో ఇప్పుడు అలమటించే పరిస్థితి ఉంది. భారత్, పాకిస్తాన్, ఆఫ్రికా దేశాల్లో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మధ్యప్రాచ్యంలో ఉన్న సిరియా ఇరాక్ సహా కొన్ని దేశాల్లో అన్నమో రామచంద్రా అనే పరిస్థితి ఏర్పడింది. దీనిని ఎదుర్కోవడానికి గానూ ఇప్పుడు దేశాలు చర్యలు తీసుకోవాలి అనేది ఐఖ్యరాజ్య సమితి మాట.

దీనిని గనుక సమర్ధవంతంగా ఎదుర్కొకపోతే మాత్రం కరోనా కంటే ఆకలి మరణాలు ఎక్కువగా ఉంటాయని, అన్ని దేశాలు ఆ విధంగా చర్యలు చేపట్టాలి అని ఐఖ్యరాజ్య సమితి తాజాగా హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అని పేర్కొంది. పాకిస్తాన్ సహా ఆఫ్ఘన్ లో, ఆఫ్రికా దేశాల్లో మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పింది.

ఆదివాసీలు, గిరిజనులతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలు ఎక్కువగా ఆకలితో ఇబ్బంది పడే అవకాశం ఉంది అని ఐఖ్య రాజ్య సమితి హెచ్చరికలు చేసింది. భారత్ లో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇవి అన్నీ కూడా జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలే మరో ఆందోళన కలిగించే అంశం.

Read more RELATED
Recommended to you

Latest news