దేశ వ్యాప్తంగా కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే సడలింపులతో బయటకి రావడం మొదలుపెట్టారు. ప్రజలు ఆర్థికంగా కొలుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితులలో సామాన్యుడి నెత్తిపై మరో భారం మోపనుంది ప్రభుత్వం. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో వరుసగా 14వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నేడు దేశీయ పెట్రోలియం కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.88కి, డీజిల్ ధర రూ.77.67కి చేరాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 81.88, డీజిల్ రూ.75.91, అమరావతిలో లీటరు పెట్రోలు ధర రూ. 82.27 డీజిల్ రూ.76.30గా ఉంది. చెన్నైలో పెట్రోలు రూ. 82.27 డీజిల్ రూ.75.29.