హ్యాకర్ల గుప్పిట్లో దేశం పడబోయే ప్రమాదం పొందిగా ఉందని భారతీయ కంప్యూటర్, అత్యవసర స్పందన సంస్థ (సెర్ట్ ఇన్) పేర్కొంది. కరోనా వీరవిహంగంగా విజృంభిస్తున్న నేపద్యంలో ఆ కరోనాణే అస్త్రంగా మార్చుకొని హ్యాకర్లు దాడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ సంస్థ హెచ్చరించింది. దేశ ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ క్లిష్ట సమయంలో ఫ్రీ గా చికిత్సలు పరీక్షలు నిర్వహిస్తామని మెయిల్ చేసి ఆ మెయిల్ కి ఆకర్షితులైన వారి పూర్తి సమాచారాన్ని హ్యాక్ చేయబోతారని ఆ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులమంటూ ప్రభుత్వం తరఫునా మాట్లాడుతున్నామని [email protected] వంటి ఈ-మెయిల్స్‌ను వినియోగిస్తూ ఇటువంటి చర్యకు పాల్పడవచ్చని ఆ సంస్థ సూచిస్తుంది. దేశ ప్రజలు ఇటువంటి మెయిల్స్ కి స్పందించవద్దని.. అటువంటి మెయిల్స్ వస్తే డిలీట్ చేయాలని అందరినీ అప్రమత్తంగా ఉండమని ఆ సంస్థ కోరుతుంది.