YS Sharmila’s sensational post on Vijayamma: విజయమ్మపై వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ పెట్టారు. ఇవాళ మదర్స్ డే ఉన్న నేపథ్యంలో విజయమ్మపై వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ పెట్టారు. అమ్మ, చీకటిలో వెలుగురేఖై, బాధల్లో బలానివై, అలసటతో ఆలనవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్ర్రాణం, నా ప్రేరణ, అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ ఎమోషనల్ అయ్యారు షర్మిల.
కాగా వైఎస్ షర్మిలను గెలిపించండి అంటూ నిన్న వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. కడప ప్రజలు రాజశేఖర్ రెడ్డి ని ఆదరించారు….రాజశేఖరరెడ్డి ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవలోనే ఉన్నారని వెల్లడించారు. ఇవాళ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల ఎంపీగా పోటీ చేస్తోందని వివరించారు.