దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఎన్నో జాగ్రత్తలు వహిస్తున్న రాజకీయ వేత్తలను సెలబ్రిటీలను సైతం కరోనా వదలడం లేదు. నీడలా వెంటాడుతుంది, తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ ఎమ్మెల్యే కరోనాతో నెల రోజులు పొరాడి తుది శ్వాస వదిలాడు. ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలను సైతం కరోనా వదలం లేదు. విజయ నగరం ఎస్ కోట జిల్లా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా అనుమానం తో టెస్టు చేయించుకున్న కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అమరావతికి వెళ్లడంతో తోటి ఎమ్మెల్యేల్లో అంధోలన మొదలయ్యింది. డాక్టర్ సుధాకర్ ను అతని గన్ మెన్ ను మరియు సన్నిహితులను హోమ్ క్వారంటైన్ లో ఉండమని వైద్యులు సూచించారు.
వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..! ఆయన మనవడికి కూడా….?
-