చైనా దుస్సహసం…! భారత్ వార్నింగ్..! సరిహద్దు దాటితే.. యుద్ధం తప్పదు…!

-

line of actualcontrol at indo china border
line of actualcontrol at indo china border

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయి. గల్వాన్ ఘర్షణ అనంతరం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చైనా ఆర్మీ గుంపులు కట్టడం గుడారాలు నిర్మించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. అటు వైపు నుండి చైనా సైనికులు తమ కార్యకలాపాలు చేస్తుంటే ఇటు వైపు భారత్ ఆర్మీ కూడా తమ బాలాన్ని నిరూపించుకుంటుంది. కానీ చైనా ఆర్మీ హద్దులు మీరుతుంది భారత్ సరిహద్దులోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సరిహద్దు దాటి 423 మీటర్లు లోనికి చొచ్చుకొచ్చిందని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భారత్ చైనా ల మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతల దృష్ట్యా వాటిని సద్దుమణిగేలా చేయడానికి భారత్ చైనా ఆర్మీ కమాండర్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు దఫాల చర్చలు చైనా వైపున ఉన్న మోల్డోలో జరగ్గా, నేటి చర్చలు భారత భూభాగంలోని చుల్‌షుల్‌లో జరగనున్నాయి. ఇక నేడు జరగాల్సిన చర్చలో భారత్ చైనాను సరిహద్దు దాటే ప్రయత్నం మానుకొమ్మని నియమాలు ఉల్లాఘించవద్దని హెచ్చరించే ప్రయత్నం చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news