దేశంలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణలోను అదే పరిస్థితి నెలకొంది కేవలం గత రెండు రోజుల్లో దాదాపుగా 2000 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం లో 15 వేల కేసులు దాటేశాయి అందులో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 11 వేల పై చిలుకు కేసులు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈ అంశం పై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేసులను నియంత్రించేందుకు రాష్ట్రంలో 15 రోజులపాటు కఠిన లాక్ డౌన్ పెట్టక తప్పదు అని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులివ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. లాక్‌డౌన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఏర్పడనున్న పరిణామాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం అనంతరం జూలై 3 న కేసీఆర్ లాక్ డౌన్ ను పొడగిస్తూ ప్రకటన జారీ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..! ఎమర్జెన్సీ కేబినెట్ సమావేశం…! అందుకేనా…
-