కరోనా వైరస్ కారణంగా గత రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్ లు జరగలేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు హరిక్రిష్ణ, ప్రభాకర్ లకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్లో పాల్గొన్న మిగతా ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు బెంబేతెల్తిపోతున్నారు. తాజాగా బుల్లితెర నటి నవ్య స్వామి వైరస్ బారిన పడినట్టు సమాచారం.
‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుంది. దీంతో వైరస్ నిర్థారణ పరీక్ష చేయగా, పాజిటివ్ అని తేలిందట. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పని చేసిన వారందరికి పరీక్షలు జరుపుతున్నారని సమాచారం.