కరోనా కి మందులు ఇప్పిస్తాము మాతో రా…! మైనర్ బాలిక పై ఇద్దరి పైశాచికత్వం..!

-

two minor boys tried to molest a minor girl in chhattisgarh
two minor boys tried to molest a minor girl in chhattisgarh

ఓ మైనర్ బాలికకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఇద్దరు బాలులు నమ్మించారు ఆమెకు మందులు ఇప్పిస్తాము అని వారితో ఆ బాలికను తీసుకువెళ్లారు.. ఆపై ఆ బాలిక పై సామూహిక లైంగిక దాడులు చేశారు ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్ లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. లైంగిక దాడులకు పాల్పడినవారు కూడా మైనర్ బాలులే కావడం గమనార్హం…! ఆ బాలిక ఫిర్యాదు నమోదు చేసుకున్నా పోలీసులు బాలుల పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే… ఛత్తీస్‌ఘడ్ లోని ఓ గ్రామంలో ఓ మైనర్ బాలిక పై కన్నెశారు అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలులు. ప్రస్తుత కరోనా నేపద్యం లో బాలికకు కొంత జ్వరం రావడంతో ఆ బాలికకు కరోనా వచ్చిందని మాయమాటలు చెప్పారు. నిజంగానే కరోనా వచ్చిందేమో అని నమ్మేలా చేశారు ఆపై తమతో రమ్మని పక్క ఊరిలో ఉన్న ఆసుపత్రిలో మందులు ఇప్పిస్తామని ఆ బాలికకు చెప్పి టమాటో తీసుకెళ్లారు. అదే సమయాన్ని అనువుగా చూసుకొని ఆ బాలిక పై సామూహికంగా అత్యాచారానికి ప్రయత్నించారు. బాలిక పై సామూహిక లైంగిక దాడులు చేశారు. ఆ బాలిక ఇంటికి త్వరగా రాకపోయేసరికి బాలిక తల్లిదండ్రులకు బాలిక తమ్ముడు జరిగిన విషయాన్ని వివరించాడు. బాలిక ఇంటికి తిరిగిరావడంతో బాలికను గట్టిగా ప్రశ్నించేసరికి విషయం బయటపడింది. దాంతో బాలిక తల్లిదండ్రులు నేరస్తులపై కేసు నమోదు చేశారు. ఆ బాలులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news