ఇలా ఉంటే ప్రశాంతంగా, సంతోషంగా ఉండొచ్చు.. భగవద్గీత ఏం చెప్తోంది..?

-

భగవద్గీత ఎన్నో విషయాలని చెప్తుంది. భగవద్గీత ఎలా ఉంటే సంతోషంగా ఉండొచ్చు అనేది కూడా చెప్పింది. ఆధునిక కాలంలో భగవద్గీత మనకేం బోధిస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆధునిక కాలంలో వచ్చిన మార్పుల గురించి ఎప్పుడో భగవద్గీతలో ఉంది. నిజానికి భగవద్గీతలో ఒక మనిషి గురించి, అతని వ్యక్తిత్వం గురించి ఎలా జీవించొచ్చు, ఎలా జీవించకూడదు అనే అంశాలు ఇలా అందులో ఉన్నాయి. భగవద్గీత ప్రకారం ఏ విషయం గురించి ఆందోళన చెందకూడదు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. ఈ జీవితం ఏది ఇచ్చిందో దానిని స్వీకరించి ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. సమస్యలు వస్తే అధిగమించాలి కానీ ఆందోళన చెందకూడదు అని ఉంది.

ఉద్యోగం మీరు అనుకున్న ప్రకారం రాకపోయినా ఆశించిన ప్రకారం విజయం కాకపోయినా ఎప్పుడు నిరాశ చెందకూడదని అందులో ఉంది. గతాన్ని నియంత్రించలేరు. భవిష్యత్తుని నియంత్రించలేరు. వర్తమానాన్ని మాత్రమే కనుక పూర్తిస్థాయిలో జీవించడానికి ప్రయత్నం చేయాలి అని భగవద్గీతలో ఉంది. ఒత్తిడిని పెంచుతుంది. గతం గురించి ఆలోచిస్తే బాదే కలుగుతుంది అని ఉంది.

జీవితంలో స్థిరంగా ఉండే ఏకైక విషయం మార్పు. అందుకు సిద్ధంగా ఉండాలి లేకపోతే ధనవంతులు రేపటికి పేదలు అవ్వచ్చు అని ఉంది. నేటి పేదవారు రేపు కోటీశ్వరులు అవ్వచ్చు అని కూడా ఉంది. కీర్తి, అదృష్టం రెండూ కొంతమందికి పోవచ్చు. కొందరికి ఊహించని విధంగా పేరు ప్రఖ్యాతలు రావచ్చు అని కూడా ఉంది. లోకంలో ఒంటరిగానే ఉంటారు తిరిగి ఒంటరిగానే వెళ్తారు. ఖాళీ చేతులతోనే ఈ భూమిపై అడుగు పెట్టారు తిరిగి ఖాళీ చేతులతోనే భూమిలో కలిసిపోతారు అని కూడా ఉంది కాబట్టి భగవద్గీత చెప్పిన విషయాలను గుర్తు పెట్టుకుంటే లైఫ్ లో ఎన్నో మార్పులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news