ఆంధ్రప్రదేశ్ లో జులై 8న చేపట్టాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన తెలిసిందే. దీంతో ఆగస్టు 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. తాను గెలిస్తే అందరినీ సొంతింటివారిని చేస్తానని జగన్ అన్నారని తెలిపారని. 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామంటే సాధ్యంకాదని తాను ముందు అన్నానని..కానీ ఇచ్చిన మాటను సీఎం జగన్ అమలు చేస్తున్నారని బొత్స చెప్పారు.
8న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నామని.. ఇందుకోసం 22068 ఎకరాలు సేకరించామని తెలిపారు. ప్రభుత్వం ఓ యజ్ఞం చేస్తుంటే…కొందరు రాక్షసుల మాదిరి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కోర్టులో చంద్రబాబు నాలుగు రిటి పిటిషన్లు వేశారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆగస్ట్ 15న పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.