తగ్గిన వెంకన్న స్వామి ఆదాయం …!

-

లాక్ డౌన్ సమయంలో దేశంలోని అన్ని దేవాలయాలు మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే అన్ లాక్ 1.0 నుండి సడలింపుల కారణంగా దేశంలోని ఆలయాలు తెరుచుకుని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ దైవం వెంకన్న స్వామిని దర్శించడానికి గత నెల రోజుల్లో రెండు లక్షలకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఎందుకని శ్రీవారి హుండీకి భక్తుల నుండి రూ. 14 కోట్ల మేర ఆదాయం వచ్చింది. జూన్ 8 తారీకు నుండి భక్తులు ఆలయ దర్శనానికి వచ్చేలా ఏర్పాటు చేసింది టీటీడీ.

TIRUMALA
TIRUMALA

మార్చి 20వ తేదీ వరకు ఎప్పటిలాగానే రోజు దర్శనానికి ఎన్ని 80వేల నుండి లక్ష మంది భక్తులను దర్శించుకునే వారు. అయితే కరోనా కారణంగా మార్చి 20 నుండి మే 7 వరకు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిలిపివేశారు. ఆ సమయంలో స్వామి వారికి కేవలం ఏకాంత సేవలు మాత్రమే కొనసాగించారు. ప్రస్తుతం కూడా కరోనా నేపథ్య దృష్ట్యా తక్కువ సంఖ్యలోనే భక్తులకు అనుమతి కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. జులై ఒకటో తారీకు నుండి కేవలం రోజుకు 9 వేల మంది భక్తులకు మాత్రమే వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే కరోనా రాకముందు టీటీడీకి స్వామి వారి కొండ ద్వారా 200 నుండి 220 కోట్లు ఆదాయం ప్రతి నెల వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఆ ఆదాయం కేవలం 14 కోట్లకు పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news