వైఎస్. రాజశేఖరరెడ్డి జయంతి.. “బావగారు” అంటూ మోహన్ బాబు ట్వీట్..!

-

దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. “స్నేహశీలీ, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్. రాజశేఖరరెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసారు.

1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా చేసిన మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణువర్ధన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విరానికా రెడ్డికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పెదనాన్న అవుతారు. అందుకే జగన్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి కూడా ఎప్పుడూ సత్సంబంధాలుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news