సనాతన ధర్మం అనంతం. దీనికి మూలం వేదం. వేదాన్ని సామాన్యుడికి అర్థం కావడానికి దాన్ని అనేక రకాలుగా మన పెద్దలు మనకు అందించారు. వీటిల ప్రధానంగా అందరికీ తెలిసినవి ఎక్కువగా వినే పేర్లు.. ఇతిహాసాలు, పురాణాలు వీటికి మధ్య ఉన్నతేడా గురించి పెద్దలు, పండితులు చెప్పిన విషయం తెలుసుకుందాం…
ఉపనిషత్తులు సర్వజగత్కారణమైన పరబ్రహ్మను మనకు తెలియజేస్తాయి. ఉపనిషత్తు వేదభాగం కనుక
శాసనంగా ఉంటాయి. ఇక పురాణేతిహాసాలు, ఉపనిషత్తులు చెప్పిన పరబ్రహ్మమును ఇతర వేదభాగం బోధించిన ధర్మార్ధాల్ని సంపాదించు విషయాన్ని దృష్టాంతాలతో జరిగిన కథాసన్నివేశాలతో మిత్రుని వలె బోధిస్తూ ఉంటాయి. ఇలా సామాన్యుడికి అర్థం అయ్యేలా కథల రూపంలో చెప్పినవే పురాణాలు. వీటిలో కాలాంతరాలలో అనేక ఇతర విషయాలు కలసిపోయాయి అని మన పెద్దలు చెప్తున్నారు. ఏది ఏమైనా మొదలు జ్ఞానతృష్ణ ఏర్పడితే చివరకు వేదాలవైపు వెళ్లి అనంతమైన పరబ్రహ్మ గురించి శోధించవచ్చు.
పురాణేతిహాసాలకూ ఉపనిషత్తులకూ తేడా ఏమిటి?
-