ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం.. ఆ 89 యాప్‌లు బ్యాన్..!

-

ఫేస్‌బుక్, టిక్‌టాక్, ట్రూ కాలర్, ఇన్‌స్టాగ్రామ్ సహా 89 యాప్‌లను వినియోగించరాదని ఇండియన్ ఆర్మీ సైనికులకు సూచించింది. భద్రతా కారణాల రీత్యా టిండెర్, కౌచ్ సర్ఫింగ్ లాంటి యాప్‌లను కూడా డిలీట్ చేయాలని కోరింది. డైలీహంట్ వంటి న్యూస్ అగ్రిగేటర్‌ యాప్‌లను కూడా వాడొద్దని స్పష్టం చేసింది. స్మార్ట్‌ఫోన్లలో ఈ యాప్‌లు సమాచారం లీక్ అవడానికి కారణమౌతాయని అందువల్ల వాటిని వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.

ఆర్మీలో పని చేస్తున్న సైనికులు జులై 15 రోజుల్లోగా ఈ యాప్ లలో ఉన్న తమ అకౌంట్స్‌ను తొలగించాలని ఆర్మీ ఆదేశించింది. అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసిందని సమాచారం. చైనా, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల నుంచి భారత సైనికులు, సైనికాధికారులు తరచూ దాడికి గురువుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news