ముఖేష్ అంబానీ… భారతదేశంలో ప్రత్యేకంగా పరిచయం లేని పేరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అయిన ముకేశ్ అంబానీ తాజాగా మరో శిఖరాన్ని చేరారు. ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న ముకేశ్ అంబానీ తాజాగా ప్రపంచ ధనవంతుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. వారన్ బఫెట్ ను అధిగమించి ముకేశ్ అంబానీ ఈ స్థానాన్ని పొందాడు.
ప్రముఖ బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం… గురువారం నాటికి వారెన్ బఫెట్ సంపద 67.9 బిలియన్ డాలర్లు ఉండగా, తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 68.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన వారన్ బఫెట్ ని అధిగమించినట్లయింది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ఫేస్ బుక్, సిల్వర్ లేక్ వంటి బడా సంస్థల నుండి అనేక పెట్టుబడులు రావడంతో రిలయన్స్ షేర్ల విలువ భారీగా పెరగడంతో ఈ స్థాయికి ఆయన చేరుకున్నారు. అయితే తాజాగా వారెన్ బఫెట్ ఓ స్వచ్ఛంద సంస్థ కు ఏకంగా 2.9 బిలియన్ డాలర్లు సహకారం అందించడంతో ఆయన సంపద కొద్దిమేర తగ్గింది. దింతో తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే టాప్ 10 సంపన్నులలో ముకేశ్ అంబానీ స్థానాన్ని పొందారు.