వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న వారికి షాక్…!

-

మీరు ఇటీవల ఏమైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేశారా…? అయితే మీకు ఇది చిన్న షాక్ అనే చెప్పాలి. మార్చి 31వ తేదీ వరకు bs 4 వాహనాలను కొనుగోలు చేసి ఉంటే మాత్రం ఇప్పుడు మీరు వెహికల్ ను రిజిస్టర్ చేయించుకో లేరు. అయితే నిజంగా బి ఎస్ ఫోర్ వాహనదారులకు చిన్న షాక్ తగిలింది అని చెప్పాలి. కొత్తగా కార్ లేదా టూవీలర్ కొనుగోలు చేస్తే మీకు ఈ పాట్లు తప్పవు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మార్చి 27న ఇచ్చిన ఆర్డర్ ను వెనక్కి తీసుకుంది. కాబట్టి దీనితో మార్చి 31వ తేదీ తర్వాత కొనుగోలు చేసిన బి ఎస్ ఫోర్ వాహనాలను రిజిస్టర్ చేసుకోవడం వీలు అవ్వదు.

vehicles registration
vehicles registration

ఆటోమొబైల్ కంపెనీలు అవకాశాన్ని వినియోగించుకోకుండా అత్యాశకు వెళ్లారని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనితో మార్చి 27 న ఇచ్చిన ఆర్డర్ ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. జూలై 23 కు తదుపరి విచారణను వాయిదా వేసింది. సుప్రీం కోర్టు మార్చి 27న ఆటోమొబైల్ కంపెనీ బి ఎస్ ఫోర్ వాహనాలు విక్రయించడానికి 10 రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 1,05 ,000 వాహనాలు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది కానీ సుప్రీం కోర్టు చెప్పినట్టు ఆటోమొబైల్ కంపెనీలు వినలేదు. పది రోజుల్లో ఆటో మొబైల్ కంపెనీలు 2,55 ,000 వాహనాలని విక్రయించారు.

అయితే దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 27 ఆర్డర్ ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలియజేసింది. దీంతో ఇక సుప్రీంకోర్టు నిర్ణయం వలన మార్చి 31 తర్వాత కొనుగోలు చేసిన బి ఎస్ ఫోర్ వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నిలిచిపోనుంది. ఒకవేళ మీరు 31 కన్నా ముందే వాహనాలను కొనుగోలు చేస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. డీలర్ వాహన కొనుగోలు అంశాన్ని వాహనం పోర్టల్ లో అప్ లోడ్ చేయకపోతే ఆ వాహనం కొనుగోలు కూడా పరిగణనలోకి రాదు అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news