కరోనా వైరస్ తెలంగాణాలో ఎంత దారుణంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా భాదితులకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ వారికి ఉచితంగా కరోనా కిట్లను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో 17 రోజులకు సరిపోయే మందులను ఇస్తారు. అలానే మాస్కులు, శానిటైజర్లు, యాంటీ బయోటిక్స్, విటమిన్ టాబ్లెట్స్ అన్ని ఇస్తారు. ఏ రోజు ఏవి వేసుకోవాలి అనేదానికి ఓ పుస్తకాన్ని ఇస్తారు.