కోవిడ్ నుంచి కోలుకున్న ఓ పేషెంట్ షేర్ చేసిన ఇమ్యూనిటీ డ్రింక్‌..!

-

సైంటిస్టులు కనిపెట్టిన వైద్య మందులు, మాత్రలు, వ్యాక్సిన్లు ఏదైనా రోగాన్ని నయం చేయలేకపోతే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆయుర్వేదమే. నయం చేయలేని భయంకరమైన ప్రాణాంతక రోగాల్ని కూడా ఆయుర్వేద నయం చెయ్యగలదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న ప్రాణాంతక నావెల్ కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టేందుకు ఎంతోమంది తల పండిన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు కానీ ఒక్కరు కూడా సరైన వ్యాక్సిన్ తయారు చేయలేదు. భౌతిక దూరం, మాస్కులు తప్ప మరేతర వ్యాక్సిన్, మందులు గాని ప్రజలను కరోనా వైరస్ నుండి కాపాడ లేక పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ని ఆయుర్వదం చంపేస్తుందని కొంతమంది చెబుతూ అందరిలో ధైర్యం నింపుతున్నారు.

Ayurveda medicine
Ayurveda medicine

5 వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఈ ఆయుర్వేద వైద్యం ఏ డాక్టర్ న్యాయం చేయలేని రోగాలను కూడా నయం చేయగలదని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. మూలికలు, వంట గది లో లభించే పసుపు, అల్లం, వెల్లుల్లి, శొంఠి మిరియాలు తదితర వి రోగాలు రాకుండా చేస్తాయి. వీటిని తరచుగా మన ఆహారంలో తీసుకుంటే దాదాపు 99 శాతం ఎటువంటి రోగాలు దరిచేరవని స్పష్టమయింది. మూలికలలో అశ్వగంధ, తులసి, గిలోయ్ వంటివి రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచేసి… చాలా రోగాలని నయం చేయగలవు. అయితే కొవిడ్-19 ని కూడా ఆయుర్వేద మూలికలు నయం చేయగలవని, తనకు వచ్చిన covid-19 వ్యాధిని ఆయుర్వేద మూలికలు నయం చేశాయని కొవిడ్-19 నుండి కోలుకున్న ఒక మహిళా పేషెంట్ చెబుతున్నారు. కధా అనే మూలికల పానీయం తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో సరిపడినంత విశ్రాంతి తీసుకోవడంతో తనకు covid-19 వ్యాధి తగ్గిందని కొవిడ్-19 వ్యాధిగ్రస్తురాలు చెప్పుకొస్తున్నారు. ప్రాణాలను రక్షించే కధా మూలికల పానీయం ఎలా తయారు చేయాలో కూడా కొవిడ్-19 పోరాడి గెలిచిన మహిళ వివరించారు. అదేమిటో, ఎలా తయారు చేయాలో కింద తెలుసుకుందాం.

కావలసిన ఆయుర్వేద పదార్థాలు:

ఐదు/ఆరు తులసి ఆకులు, ఒక నల్లటి యాలుక/ రెండు పచ్చ యాలుకలు, సన్నగా తరిగిన పచ్చి పసుపు కొమ్ములు, ఒక చెంచాడు లవంగాలు, ఒక చెంచాడు నల్లటి మిరియాలు, సన్నగా తరిగిన అల్లం, ఒక చెంచాడు ఎండు ద్రాక్ష.

కధా మూలికల పానీయం తయారీ విధానం:

మొట్టమొదటిగా తరిగిన అల్లం, పచ్చి పసుపు కొమ్ములు రెండూ కలిపి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత నాలుగు కప్పుల నీళ్లను మెత్తగా దంచుకున్న అల్లం, పసుపు పోసి పసుపు అల్లం మిశ్రమాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి కాసేపు సన్నని సెగమీద కాగనివ్వాలి. ఆ మిశ్రమం పసుపు పచ్చగా మారిన తర్వాత అందులో పైన చెప్పుకున్న అన్ని పదార్థాలను వేయాలి. అనంతరం 20 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని ఉడకనిచ్చి మిశ్రమం లోని నీళ్లు సగం తగ్గినట్లు అనిపించగానే పొయ్యి ఆపివేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక చెంచాడు తేనె మిశ్రమంలో వేసి వేడి వేడిగా ఉన్నప్పుడే స్వీకరించాలి.

ఇకపోతే ఈ మిశ్రమంలో కలిపిన నల్లటి మిరియాలు జలుబు దగ్గు తగ్గడం లో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఈ నల్లటి మిరియాలు ఊపిరితిత్తుల సక్రమంగా పని చేయడానికి ఎంతో దోహదపడతాయి. రోజుకి రెండు సార్లు కధా మూలికల పానీయం తాగడం వలన సానుకూల ఫలితాలు త్వరలోనే వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news