కరోనాతో ప్రముఖ బెంగాలీ నటి కోయెల్ కుటుంబం..!!

కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో విస్తరిస్తున్న వేళ అందరు భయ బ్రాంతుల్లో ఉండిపోయారు.ఇప్పటికే కరోనా వైరస్ చాలా మందికి సోకింది. అయితే ఇప్పుడు ప్రముఖ బెంగాలి నటీ కోయెల్ మల్లిక్‌ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారంట. ఒక్క కోయిల్ మల్లిక్ మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తానికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని కోయెల్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

తన తండ్రి, ప్రముఖ బెంగాలీ నటుడు రంజిత్ మల్లిక్‌, తల్లి దీపా మాలిక్, భర్త నిస్పల్ సింగ్‌తో పాటు తనకి కరోనా సోకినట్టు కోయెల్ పేర్కొంది.అయితే ఇప్పుడు ప్రస్తుతం మేము అందరం క్వారంటైన్‌లో ఉన్నాం. త్వరలో కోలుకుంటామని భావిస్తున్నాం అని కోయెల్ తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా సందేశం తెలిపారు.

కోయెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీకి కరోనా సోకిన విషయం తెలిసిన అభిమానులు, ప్రముఖులు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ పెడుతున్నారు. 38 ఏళ్ల కోయెల్ చివరిసారిగా పరంబ్రత ఛటర్జీ, అంజన్ దత్తాలతో కలిసి బోనీ సినిమాలో నటించారు. బెంగాల్ సినీ పరిశ్రమలో ప్రముఖనటిగా పలు చిత్రాల్లో కోయెల్ నటించారు. అయితే కొయెల్ మే 5వతేదీన పండంటి బాబుకు జన్మనిచ్చింది. .కోయెల్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పలు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.