లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్లీనరీ పై కీలక నిర్ణయం..!

-

ప్లీనరీకి బీఆర్ఎస్ పార్టీ మంగళం పాడినట్లయింది. గతేడాది కూడా ప్లీనరీ నిర్వహించకుండానే కేవలం భవన్లోనే పార్టీ జెండాను ఎగురవేసి జనరల్ బాడీ సమావేశంతో ముగించారు. ఈ ఏడాది జెండావిష్కరణతోనే మమా అనిపిస్తుంది. పార్టీ నేతలంతా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధిష్టానం సూచించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు, కేడర్ అంతా ప్రచారంలో బిజీగా ఉండటంతోనే ప్లీనరీని నిర్వహించడం లేదని పార్టీ నేతులు పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లీనరీ నిర్వహిస్తుంది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు ఉండటం, పార్టీ నాయకులు, కేడర్ అంతా పార్టీ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో ప్లీనరీ నిర్వహించడం లేదని సమాచారం. ప్లీనరీ నిర్వహిస్తే మూడునాలుగు రోజులకు పైగా సమయం వృథా అవుతుందని భావించినట్లు తెలిసింది. మరో పదహారు రోజులు మాత్రమే లోక్సభ పోలింగ్కు సమయం ఉంది. ఈ సమయంలో పార్టీ కేడర్ అంతా జనం మధ్యలో ఉంటేనే పార్టీకి ప్లస్ అవుతుందనే నిర్ణయానికి వచ్చే ప్లీనరీపై వెనక్కి తగ్గినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లోనే జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం నేతలకు పిలుపు నిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news