”అస‌లేం జ‌రిగింది ?” మూవీ పాట‌ల‌కు విశేష స్పంద‌న

-

తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌ల ఆధారంగా రూపొందించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ మూవీ అస‌లేం జరిగింది ? పాట‌ల‌కు ఆడియ‌న్స్ నుంచి చ‌క్క‌టి స్పంద‌న వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాత కింగ్ జాన్స‌న్ తెలిపారు. విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్ర‌కాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గ‌వి పిళ్లై వంటి ప్ర‌ముఖ సింగ‌ర్లు పాడిన పాట‌ల‌కు అమెజాన్ మ్యూజిక్‌, స్పాటిఫై, జియోసావ‌న్‌, యాపిల్ మ్యూజిక్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చ‌క్క‌టి రెస్సాన్స్ వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సెన్సార్ క్లియ‌రెన్స్ వ‌చ్చింద‌ని, థియేట‌ర్లు తెరుచుకునేంత‌వ‌ర‌కూ వేచి చూడాలా ? లేక ఓటీటీలో రిలీజ్ చేయాలా ? అనే విష‌యాన్ని అంత‌ర్గతంగా చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు.

good response to asalem jarigindhi movie songs

సినిమా చాలా రిచ్‌గా వ‌చ్చింద‌ని, 8కే రిజ‌ల్యూష‌న్ కెమెరాతో సినిమాను షూట్ చేశామ‌ని తెలిపారు. ఈ సినిమాకు ప్ర‌ముఖ బ్యాక్ గ్రౌండ్ స్కోర‌ర్ ఎస్‌.చిన్నా సంగీతం అందించార‌ని అన్నారు. సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయ‌ని తెలిపారు. సినిమాలో న‌టుడు శ్రీరాం చ‌క్క‌గా న‌టించార‌ని అన్నారు. అత‌ని న‌ట‌నకు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయ‌న్నారు.

కాగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ యేలేంద్ర మ‌హావీర్ స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందించిన అస‌లేం జ‌రిగింది ? సినిమా పాట‌ల‌ను ఆదిత్యా మ్యూజిక్ ఇటీవ‌లే విడుద‌ల చేసింది. 5 విభిన్న‌మైన గీతాల‌ను విడుద‌ల చేయ‌గా వాటిని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని చిత్ర నిర్మాత నీలిమా చౌద‌రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news