బర్త్ డే ప్రాంక్.. కట్ చేస్తుండగా పేలిపోయిన కేక్ !

-

8 సెకండ్ల బర్త్ డే ప్రాంక్ వీడియో. టిక్ టాక్ నుంచి ట్విటర్ లో ఈ క్లిప్ ని అప్లోడ్ చేసి క్యాప్షన్ కింద వెయిట్ ఫర్ ఇట్ అంటూ రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓ యువతి పుట్టిన రోజు సెలబ్రేషన్ మొదలయ్యాయి. బర్త్ డే కేక్ ఆమె ముందు ఉంచారు. కానీ నిజానికది కేక్ కాదు. చూడటానికి అచ్చం కేక్ లా కనిసిస్తుంది. చాకొలెట్ తోపాటు చుట్టు క్రీమ్ కూడా ఉంచారు.

birthday
birthday

యువతి.. కేక్ కట్ చేయడానికి సిద్ధమైంది. బ్యాక్ గ్రౌండ్ నుంచి హ్యాపీ బర్త్ డే అంటూ పాట వినిపిస్తోంది. ఆమె కేక్ ను కట్ చేయడానికి నైఫ్ తో కోయబోయింది. ఇంతలో ఒక్కసారిగా టప్ మనే సౌండ్ తో కేక్ పగిలిపోయింది. ఆ కేక్ నుంచి వాటర్ బయటకు వచ్చి టేబుల్ మొత్తం వ్యాపించింది.రెడ్ కలర్ బెలూన్ ను నీటితో నింపి దాని చుట్టు చాకొలెట్, క్రీమ్ పూత పూసి 8 సెకన్ల నిడివితో వీడియో తీసి ట్విటర్ లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు 90 లక్షల మంది వీక్షించగా.. 88 వేల మంది లైక్ కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news