భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళినీ శ్రీహరన్ ఆత్మహత్యా యత్నం చేసారు. వేలూరు జైల్లో గత 29 ఏళ్ళుగా తన భర్త మురుగన్ తో కలిసి శిక్ష అనుభవిస్తున్న నళినీ తాజాగా తోటి ఖైదీ తో జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్యా యత్నం చేసారని ఆమె తరుపు న్యాయవాది మీడియాకు వివరించారు. ఆమె సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసారని పేర్కొన్నారు.
ఆమె గత 29 ఏళ్ళలో ఇలా ఎప్పుడు చేయలేదు అని ఇప్పుడే ఆమె ఇలా చేసారని, ఆమె ఆత్మహత్యకు అసలు కారణం ఏంటీ అనేది తమకు తెలియాలి అని ఆయన డిమాండ్ చేసారు. తనను వేలూరు జైలు నుంచి వేజ్జూరు జైలుకి మార్చాలి అని ఆమె డిమాండ్ చేసారు. అయినా సరే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. ఇక కాంగ్రెస్ కనుకరించినా సరే బిజెపి సర్కార్ మాత్రం వారిని జైల్లోనే ఉంచుతుంది.