సీఎం జగన్ కీలక నిర్ణయం.. రైతులకు శుభవార్త..!?

-

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. రైతుల సంక్షేమానికి అభివృద్ధి కోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతులకు మేలు జరిగే విధంగా జగన్ సర్కార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు కరోనా భయం లేకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు అన్నింటిలో నేటి నుంచి డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీంతో ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడ కరెన్సీ మార్చుకుంటే కరోనా వైరస్ వస్తుందో అనే భయాందోళనలో ఉన్న రైతులు.. జగన్ సర్కార్ ఇచ్చిన తాజా ఆదేశాలతో… గూగుల్ పే ఫోన్ పే సహా మరికొన్ని డిజిటల్ వాలెట్ల ద్వారా… ఎరువులు విత్తనాలు తీసుకున్న సమయంలో చెల్లింపులు జరిపేందుకు అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news