అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో టైమ్​ క్యాప్సుల్​ అవాస్తవం..!

-

అయోధ్యలో రామమందిరం నిర్మించే చోట 2000 అడుగుల లోతులో టైమ్​ క్యాప్సుల్​ను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఆగస్టు 5న రామాలయ భూమిపూజ కార్యక్రమం సందర్భంగా అక్కడ 2,000 అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్​ను ఏర్పాటు చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.

ayodya
ayodya

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న భూమిపూజ కార్యక్రమం జరగనుంది. మందిరం నిర్మించే చోట 2,000 అడుగుల లోతులో టైమ్​ క్యాప్సుల్​ను భద్రపరచనున్నట్లు ట్రస్టు సభ్యుడు కామేశ్వర్​ చౌపాల్ సోమవారం ప్రకటించారు. రామమందిరానికి సంబంధించిన చరిత్ర, వాస్తవాల పూర్తి వివరాలను ఇందులో పొందుపరచనున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news