కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే.. ప్రభుత్వమే అంత్యక్రియల బాధ్యతను తీసుకుంటుందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏ ఆస్పత్రిలోనూ కరోనా ఔషధాల కొరత లేదని మంత్రి తెలిపారు. కరోనా రోగులకు వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏ ఆస్పత్రిలోనూ కరోనా ఔషధాల కొరత లేదని స్పష్టం చేశారు. కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం పారదర్శకంగా కరోనా నివారణ చర్యలు చేపట్టిందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనా విషయంలో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కరోనా మరణాలు తగ్గాయన్నారు.కరోనా మృతులకు నిర్భయంగా దహన సంస్కారాలు చేయవచ్చని.. అంత్యక్రియలకు కొన్నిచోట్ల కుటుంబసభ్యులు వెనుకంజ వేస్తున్నారని మంత్రి అన్నారు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ముందుకు రావాలన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే ప్రభుత్వమే దహన సంస్కారాలు చేస్తోందని తెలిపారు.