నెల్లూరు రాజకీయ నేతల మధ్య ఇటీవల సరదా సంభాషణ సంభాషణ సాగింది. ఇది ఏకంగా పార్టీ నేతలతో సీఎం జగన్ సంభాషించిన సమయంలోనే సాగడం గమనార్హం. ప్రస్తుతం నెల్లూరులో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీపం చేసిన తర్వాత.. నేతలు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దూకుడుగా ఉన్నారు. అయితే.. వీరిని ఉద్దేశించి.. జిల్లా అభివృద్ధిపై ఎవరు ఏం చేస్తున్నారనే విషయాలు.. స్థానిక మీడియాలో తరచుగా వార్తలు వస్తున్నాయి. వీటిని పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా నేతలతో సంభాషించింది.
ఈ సందర్భంలో కొందరు తమ పనులు సాగడం లేదని, మరికొందరు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారట. దీనిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మీరంతా ఉంటే గౌతం రెడ్డిలా ఉండండి! లేకపోతే.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిగా వ్యవహరించండి అన్నారట! ప్రస్తుత మంత్రి గౌతంరెడ్డి చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన ఏం చేయాలనుకున్నా.. సైలెంట్‌గా చేస్తున్నారు. ఏ విషయంలో నూ ఆయన ఎలాంటి వివాదాల జోలికీ పోవడం లేదు. ప్రతి పనినీ తానే స్వయంగా చేసుకుంటున్నారట. దీంతో ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా మంత్రి తన పనితాను స్వయంగా చేసుకుని పోతున్నారు.
ఇక, కోటంరెడ్డి విషయానికి వస్తే.. ఈయన రూరల్ ఎమ్మెల్యే. గతంలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న ఈయన ఇటీవల కాలంలో సైలెంట్ అయిపోయారు. ఎంత తీవ్రమైన సమస్య ఎదురైనా.. చిరునవ్వుతో వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామంతో ఆయన వ్యవహారంపై గతంలో వచ్చిన విమర్శలు దాదాపుగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన జగన్.. ఉంటే.. కోటంరెడ్డిగా అయినా ఉండండి అంటూ.. నేతలకు నూరిపోశారట. అంటే.. ఎలాంటి సమస్యలు ఎదురైనా సైలెంట్‌గా ఉండిపోండి అవే సాల్వ్ అవుతాయని జగన్ సూచించారని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం మాత్రం నెల్లూరులో హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది. మరోపక్క, వివాదాలకు కాలుదువ్వుతున్న ఆనం వంటి వారికి చురకలు అంటించినట్టు కూడా ఉందని చెబుతున్నారు.