ఆడవారిపై రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల ఆర్తనాదాలతో దేశం అట్టుడికిపోతుంది. వయసుతో సంబంధంలేకుండా వారిపై మృగల్లా పడిపోతున్నారు కొందరు కామాంధులు. వావివరసలు మర్చిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అధికారులు సైతం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు కూడా అరచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా మదురై జిల్లాలోని నాగర్‌కోయిల్ మాజీ ఎమ్మెల్యే నంజిల్ ఏ మురుగేశన్ 12 ఏళ్ల బాలికపై అత్యాచాలనికి పాల్పడిన ఘటన సంచాలంగా మారింది.
తనపై మాజీ ఎమ్మెల్యే మురుగేశన్, మరికొందరు తనను అత్యాచారం చేశారని ఆమె స్టేట్‌మెంట్ ఇవ్వడంతో పోలీసులు రేప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మురుగేశన్‌ను తిరునల్వేలి జిల్లా తిసాయన్‌విలైలో అరెస్టు చేశారు. అలాగే మురుగేశన్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది. ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు సమాచారం.