BIG BREAKING : దర్శకుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్..!

-

కరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద బాగా పడింది. షూటింగులు ఆగిపోయి.. హీరోలు, దర్శకులు, అలాగే సినీ వర్గాలకు చెందిన వారంతా ఇళ్ళకే పరిమితమైపోయారు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఇప్పుడిప్పుడే షూటింగులు ప్రారంభమయ్యాయి. దీంతో సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది డిని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘నేను, నా కుటుంబసభ్యులు కొద్ది రోజులుగా తేలికపాటి జ్వరంతో బాధపడ్డాం. అయితే ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ మేము కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. అయితే మాకు ఈ రోజు కొద్దిపాటి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు మేము హోం క్వారంటైన్‌లో ఉంటున్నాం. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. మాకు ఎటువంటి లక్షణాలు లేవు.. కానీ మేము అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం’ అని రాజమౌళి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news