సుశాంత్ సింగ్‌ది హ‌త్యే.. సుబ్రహ్మ‌ణ్య‌ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

-

రాజ్య‌స‌భ ఎంపీ సుబ్రహ్మ‌ణ్య‌ స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌‌లు చేశారు. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్యేన‌ని అన్నారు. అందుకు గాను ఓ డాక్యుమెంట్ కూడా రుజువు చూపిస్తుంద‌ని చెబుతూ ఆయ‌న స‌ద‌రు డాక్యుమెంట్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ డాక్యుమెంట్‌లో ఉన్న మొత్తం 26 పాయింట్ల‌లో 24 పాయింట్ల‌ను బ‌ట్టి చూస్తే సుశాంత్ సింగ్‌ది హ‌త్యేన‌ని ఎవ‌రైనా చెబుతార‌ని అన్నారు.

mp subramanian swamy says sushants death is homicide not suicide

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది ముమ్మాటికీ హ‌త్యే. అది ఆత్మ‌హత్య కాదు. అత‌ని మెడ‌పై ఉన్న ముద్ర‌లు ఆత్మ‌హ‌త్య వ‌ల్ల ఏర్ప‌డ్డ‌వి కావు. హ‌త్య వ‌ల్లే అలాంటి ముద్ర‌లు ఏర్ప‌డుతాయి.. అని సుబ్రహ్మ‌ణ్య‌ స్వామి అన్నారు. కాగా ఆ డాక్యుమెంట్‌లో ఉన్న వివ‌రాల ప్ర‌కారం.. సుశాంత్ సింగ్ చ‌నిపోవ‌డానికి కొద్ది రోజుల ముందు అత‌ని మేనేజ‌ర్ దిశ స‌లియ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, ఆమెకు సుశాంత్‌కు సంబంధించిన ఏదో ముఖ్య‌మైన విష‌యం తెలిసి ఉంటుంద‌ని, అందుక‌నే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని, త‌రువాత సుశాంత్‌ను ఎవ‌రో హ‌త్య చేసి దాన్ని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని ఉంది.

అయితే ముంబై పోలీసులు సీఆర్‌పీసీని ఫాలో అవుతున్నారా, లేదా అని కూడా సుబ్రహ్మ‌ణ్య‌ స్వామి ప్ర‌శ్నించారు. వారి ఉద్దేశం ప్ర‌కారం ఎఫ్ఐఆర్ అంటే ఫైన‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ అని అనుకుంటున్నార‌ని, కానీ అది.. ఫ‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ అని స్వామి గుర్తు చేశారు. కాగా ఇప్ప‌టికే సుశాంత్ తండ్రి రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా మొత్తం 6 మందిపై కేసు పెట్ట‌గా పాట్నా పోలీసులు వారిపై కేసులు న‌మోదు చేశారు. ఇక సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఈ కేసును సీబీఐచే విచార‌ణ జ‌రిపించాల‌ని కూడా డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news